'పోలీస్ వాహనాల పాత విడిభాగాల వేలం'
NLG: జిల్లా పోలీస్ కార్యాలయ మోటార్ ట్రాన్స్‌పోర్ట్(MT) విభాగంలోని పాత విడిభాగాలకు ఈనెల 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కాలం చెల్లిన టైర్లు, బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్ములు, ఇనుప సామాగ్రిని వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాల కోసం 8712670170ను సంప్రదించవచ్చన్నారు.