VIDEO: బ్రిడ్జి పనుల పరిశీలన చేసిన మంత్రి
ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.