మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారులు
WNP: విద్యార్థులకు అందించే భోజనం నాణ్యవంతంగా ఉండాలని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్లో డీఎంహెచ్‌వో సాయినాథ్ రెడ్డి, CMO ప్రతాపరెడ్డితో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంవో మహానంది, హెచ్ఎం శివాజీ ఉన్నారు.