VIDEO: శంషాబాద్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
HYD: మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో PS వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడకు భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుని అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.