బీసీలకు 17% రిజర్వేషన్ అన్యాయం: సంతోష్

బీసీలకు 17% రిజర్వేషన్ అన్యాయం: సంతోష్

BHPL: మహముత్తారం మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ యూత్ అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభాలో 56% ఉన్న BCలకు కేవలం 17% రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని మండిపడ్డారు. పలిమెల, మహాముత్తారం మండలాల్లో ఒక్క BC సీటు కూడా లేకపోవడం అన్యాయమని ఆరోపించారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని కోరారు.