ఇజ్రాయెల్‌కు మారనున్న అమెరికా స్థావరాలు..?
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ జరుపుతున్న క్షిపణి దాడుల ధాటికి ఈ ప్రాంతంలోని అనేక అమెరికా సైనిక స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయి. క్షిపణుల వర్షం కురుస్తుండటంతో అమెరికా ఆస్తులకు, రక్షణ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ దేశంలో అమెరికా స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్లు సమాచారం.