'ఉపాధి హామీ పనుల ఫైళ్ళు ఎలా కాలిపోయాయి'

'ఉపాధి హామీ పనుల ఫైళ్ళు ఎలా కాలిపోయాయి'

KMM: ఏన్కూరు MPDO కార్యాలయంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను సూచించారు.