అనుమతులు లేని నిర్మాణాలపై GHMC కొరడా
HYD: అత్తాపూర్ అంబియన్స్ ఫోర్ట్‌లో అనుమతులు లేని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేస్తుంది. అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ అనుమతులు లేని నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.