VIDEO: యువకుడి దారుణ హత్య

SKLM: సోంపేట మండలం పాలవలస గ్రామంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావు(38) గ్రామంలో జరుగుతున్న సంబరాల్లో పాల్గొని శనివారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. యువకుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం గ్రామానికి సమీపంలో ఉన్న జీడి తోటల్లో హత్యకు గురైన ఈశ్వరరావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.