యూరియా కోసం బారులు తీరిన రైతులు

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు శనివారం బారులు తీరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామానికి 330 యూరియా బస్తాలను సరఫరా చేశారు. చందుర్తి ఐకేపీ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది రైతులకు రెండు బస్తాలు చొప్పున పంపించేశారు.