తిరుమల ఘాట్ రోడ్డులో పునుగు పిల్లి మృతి

TPT: తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం అరుదైన పునుగు పిల్లి మృతిచెందింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల భాగాన దెబ్బ తగిలి చనిపోయింది. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునుగు పిల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారికి పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తారు.