భారీ వర్షాలు... కేఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాలు... కేఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

KMM: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రజలు ఈ వర్షాల కారణంగా ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8333833696కు సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో అధికారలను సంప్రదించాలని పేర్కొన్నారు.