VIDEO: టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తల కొట్లాట
అన్నమయ్య: రైల్వే కోడూరులో టీడీపీ కార్యాలయం వద్ద సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల అనంతరం ఇద్దరు కార్యకర్తలు వ్యక్తిగత కారణాలతో గొడవపడ్డారు. వాగ్వాదం తీవ్రమై పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు పార్టీతో సంబంధం లేదని, వ్యక్తిగత వివాదాలే కారణమని టీడీపీ నాయకులు తెలిపారు.