వేములవాడ రాజన్నను దర్శించుకున్న మానుకోట ప్రసాద్

SRCL: సింగర్ మానుకోట ప్రసాద్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. సింగర్ మానుకోట ప్రసాద్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ ఇంట్లో పనులు మొదలు పెట్టాలన్న వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.