VIDEO: టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి: అంబటి
GNTR: టీటీడీ ఛైర్మన్ పదవికి బిఆర్.నాయుడు రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం డిమాండ్ చేశారు. నిరసనకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ గుంటూరు లాడ్జి సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, తక్షణమే ఎస్సీ, ఎస్టీ కేసులను తొలగించాలని ఆయన మండిపడ్డారు.