యువతతో క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే నాగరాజు

యువతతో క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో మంగళవారం యువకులు క్రికెట్ ఆడుతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే నాగరాజు వారి వద్దకు వెళ్లి క్రీడల ప్రాధాన్యతను వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈ సందర్భంగా స్వయంగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ యువతను ఉత్తేజపరిచారు.