పెద్దపులిని బంధించిన అటవీ అధికారులు

పెద్దపులిని బంధించిన అటవీ అధికారులు

మహారాష్ట్రలోని అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులిని అధికారులు బంధించారు. ఈ మేరకు అటవీశాఖ ప్రకటన చేసింది. చంద్రపూర్ జిల్లాలోని డోంగర్‌గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలను అధికారులు కనిపెట్టారు. అనంతరం దానికి మత్తు ఇచ్చి ప్రత్యేక సంరక్షణ కేంద్రానికి తరలించారు. పులి పిల్లల కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. కాగా.. ఈ పులి దాడిలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.