శంషాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

శంషాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

RR: శంషాబాద్ జాతీయ రహదారి గండిగూడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వినాయకుని విగ్రహాన్ని డీసీఎంలో తరలిస్తుండగా డీసీఎం టైర్ పగలడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు భారీ వర్షం కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.