పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
PPM: NTR భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్ది, శాసనసభ్యులు బోనెల విజయచంద్రతో కలిసి పంపిణీ చేశారు. పేదల సేవలో భాగంగా NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మండలం చినమరికిలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందించారు.