'మావిగన్ మంచి నిర్ణయం'
కృష్ణా: మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మావిగన్ మంచి నిర్ణయమని, అమరావతిపై భారీ ఖర్చు తగ్గించి, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి కేవలం రూ. 20 వేల కోట్లతో మహానగరాన్ని అభివృద్ధి చేయొచ్చని వైసీపీ మహిళా నేత వరుదు కళ్యాణి అన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అక్కడి అవినీతి ఖర్చులకు వ్యతిరేకమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆమె పెడనలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చేశారు.