25 గొర్రెలు అనుమానాస్పద స్థితిలో మృతి
GDWL: గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో కుర్వ తిమ్మప్ప, ఈరన్న, వెంకటన్నలకు చెందిన సుమారు 25 గొర్రెలు మేత మేస్తుండగా అనుమానాస్పద స్థితిలో అకస్మాత్తుగా మరణించాయి. తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.