భీమవరం రోడ్డులో మృతదేహం లభ్యం

భీమవరం రోడ్డులో మృతదేహం లభ్యం

PLD: సత్తెనపల్లి-భీమవరం రహదారిపై సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు నీలం, ఆకుపచ్చ రంగు గీతలు కలిగిన చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. సత్తెనపల్లిలోని రంగా కాలనీకి చెందిన వ్యక్తి అయ్యి ఉండవొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.