VIDEO: 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్' అవగాహన ర్యాలీ
ELR: మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు శనివారం 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉంగుటూరులో పంచాయితీ కార్యాలయం నుంచి అవగహన ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడకం వద్దు కాటన్ ముద్దు అనే ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు సింధు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.