VIDEO: అర్ధరాత్రి వరకు కొనసాగిన రథయాత్ర
SRD: కంగ్టి మండలంలోని గాజులపాడ్ గ్రామంలో మహదేవుని రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష జన వాహిని మధ్య ఈ రథయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. మహాదేవుని ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్టించి, అందులో పూజారులు, జంగమస్వాములు శంఖమును పూరించి రథయాత్ర ప్రారంభించారు. హర హర మహాదేవ.. నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తి పారవశ్యంతో నిండింది.