రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడితే పారితోషికం

రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడితే పారితోషికం

ASF: రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి 'రహ్ వీర్' పథకం కింద రూ. 25,000 నగదు పారితోషికం అందిస్తామని SP నితిక పంత్ తెలిపారు. ప్రమాదం జరిగిన 'గోల్డెన్ అవర్'లో స్పందించి సాయం చేసే గుడ్ సమారిటన్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. నగదుతో పాటు ప్రశంసా పత్రం కూడా ఇస్తామని వెల్లడించారు.