మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

BHNG: వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యాంటీ డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని డ్రగ్స్‌పై ప్రజలకి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.