'ఉపకార వేతనాల రెన్యువల్‌ను వేగవంతం చేయాలి'
MDK: షెడ్యూల్ కులాల ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్ రెన్యువల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్‌లో వసతి గృహాల సంక్షేమ అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్‌లతో సమావేశం నిర్వహించారు.