రోడ్డు ప్రమాదాల నివారణకు తనిఖీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు తనిఖీలు

కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడ్లవల్లేరులో ఎస్సై సత్యనారాయణ నిన్న ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్ ఇన్‌షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.