క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేసారు.