'భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి'

AKP: అచ్యుతాపురం -అనకాపల్లి రహదారి విస్తరణలో భూములు ఇల్లు షాపులు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జీ. కోటేశ్వరరావు, నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము డిమాండ్ చేశారు. ఆదివారం అచ్యుతాపురం మండలం హరిపాలెంలో నిర్వాసితులు నిరసన తెలియజేశారు. టీడీఆర్ బాండ్లను నిర్వాసితులు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.