పాముకాటుతో మహిళ మృతి
WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో పుష్పలత అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఏఎస్సై మన్యపు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఆమెను పాము కాటేసింది. నోటి నుంచి నురగలు రావడంతో భర్త రాజేందర్ వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించింది.