వైకల్యాన్ని జయించేది మానసిక చైతన్యమే
RR: వైకల్యాన్ని జయించేది మానసిక చైతన్యమేనని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఫరూఖ్ నగర్ మండలం విఠ్యాల గ్రామంలో దివ్యాంగుడిని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో మానసిక ధైర్యాన్ని నింపి, చైతన్యం తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలన్నారు.