వ్యాన్ బోల్తా.. చెల్లాచెదురైన కోడిగుడ్లు

వ్యాన్ బోల్తా.. చెల్లాచెదురైన కోడిగుడ్లు

JN: దేవరుప్పుల మండలం మాన్సింగ్ తండా సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట- జనగామ రహదారిపై కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. వాహనం బోల్తాపడగా కోడిగుడ్ల ట్రేలు చెల్లాచెదురుగా అయిపోయాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.