'అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి'
KNR: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్- అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.