బంకుల వద్ద క్యూ.. బయటకి వస్తే పెట్రోల్ చోరీ..!
KDP: జిల్లాలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ చోరీ చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ కొరత ఉందనే ప్రచారంతో బంకుల వద్ద జనం గంటల తరబడి క్యూ కడుతుంటే.. మరోవైపు కేటుగాళ్లు ఇలా చేస్తున్నారు. పెట్రోల్ కష్టాల వేళ దొంగలతో జనం బెంబేలెత్తుతున్నారు. వాహనాల విషయంలో జనం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.