ఇటిక్యాలలో వర్షం

GDL: ఇటిక్యాల మండల పరిధిలో చిన్న పాటి వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు చాగాపురం,షాబాద్, ఉదండాపురం మరియు పలు గ్రామాలలో వర్షం పడడంతో వాతావరణం చల్లబడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా రెండు రోజులుగా వర్షం కురవడంతో వ్యవసాయ రైతులు తమ పొలాలలో విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు.