బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

NRPT: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. బాలబాలికలకు లేఖ విడుదల చేసిన ఆమె, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఆడవారికి 18, మగవారికి 21 సంవత్సరాలు పైబడి ఉండాలని చెప్పారు. బాల్య వివాహాలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. విద్యే బలమైన ఆయుధమని, విద్యను దూరం చేసుకోవద్దని సూచించారు.