రేపు దంసలాపురంలో శ్రీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం
KMM: ఖమ్మం బోనకల్ రోడ్డులోని దంసలాపురం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో సోమవారం కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. మాఘ నక్షత్రయుక్త సింహ లగ్నమున రాత్రి 8:30 గంటలకు తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామిల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.