చెరువులో చేపల మృత్యువాత
SRD: గడ్డపోతారం పట్టణంలోని ధర్మి చెరువులో చేపలు మృతి చెంది నీటిపై తేలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమీప పరిశ్రమలు వ్యర్థ జలాలను విడుదల చేయడంతో చెరువు కలుషితమైందని ఆరోపించారు. తూము వదలడంతో కలుషిత నీరు చెరువులోకి చేరి చేపలు చనిపోయాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.