చామనపల్లి బీజేపీ అభ్యర్థిగా కుమార్ నామినేషన్
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు మునిగంటి కుమార్ గురువారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ రూరల్ బీజేపీ మండల నాయకులు, జిల్లా నాయకులతో కలసి కరీంనగర్ రూరల్ ఎన్నికల కార్యాలయంలో మునిగంటి కుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.