'విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం'
శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కాలర్షిప్‌లను అందజేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని అన్నారు.