'డిజిటల్ లైబ్రరీని విద్యార్థులు వినియోగించుకోవాలి'
SKLM: డిజిటల్ లైబ్రరీని విద్యార్థులు వినియోగించుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.పోలినాయుడు పేర్కొన్నారు. ఇవాళ కళాశాలలో 58వ జాతీయగ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు విరామ సమయంలో అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదవాలని తెలియజేశారు.