కలెక్టర్ మీకోసంకు అధిక ప్రాధాన్యత!

ప్రకాశం: కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. 2024 జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సుమారు ఒక ఏడాది 3 నెలల పాలన సాగించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో అర్జీదారులకు మాలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. కాగా, అర్జీదారులకు భోజన వసతి, ఫ్రీగా అర్జీల రాయింపు వంటి చర్యలు చేపట్టారు.