కార్మికుల పాసులపై BHEL యాజమాన్యం కొత్త ఆంక్షలు

SRD: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన BHEL యాజమాన్యం కార్మికులకు విధించిన కొత్త ఆంక్షలపై మంగళవారం BHEL ప్రధాన గేటు ముందు CITU నిరసనలు తెలిపింది. గత నెెల 07న విడుదల చేసిన కొత్త ఆంక్షల సర్కులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కె. రాజయ్య ఆధ్వర్యంలో కార్మికులు ప్రధాన గేటు ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. పర్సనల్ పాస్‌లు పాత పద్ధతిలోని కొనసాగాలని కోరారు.