నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

MNCL: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఉ.11 గంటలకు భీమారం మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు. మ. 12 గంటలకు పోతుకులపల్లి, గొల్లగూడెంలో BT రోడ్డు, బ్రిడ్జి పనులకు శంకుస్థాపన అనంతరం దుబ్బపల్లిలో రోడ్డు శంకుస్థాపన, తర్వాత క్యాంప్ కార్యాలయంలో MPDOలతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు.