సింగరాయకొండలో రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా..?
ప్రకాశం: సింగరాయకొండలో రోడ్లు దారుణంగా ఉన్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రైల్వే రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయన్నారు. వర్షాలు పడినపుడు గుంటలు నీటితో నిండి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోందని వాహనదారులు వాపోయారు. ఎప్పటినుంచో సమస్య ఉన్నప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.