మద్యం తాగి డ్రైవింగ్.. ఐదుగురిపై కేసు నమోదు
KMR: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన వాహనదారులను హెచ్చరించారు.