ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

W.G: ధనుర్మాసం వచ్చేసింది. జిల్లాలో మంచు తెరలు గోదారి అలలను ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. బరిలోకి కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటుంటే, అత్తారింటికి రావడానికి కొత్త అల్లుళ్లు ఎదురు చూస్తున్నారు. సిటీల్లో ఉన్నా సరే, మనసుని లాగేసే గోదారి మట్టి వాసన, అమ్మమ్మ గారి ఊరి జ్ఞాపకాలు సంక్రాంతి ప్రత్యేకత.