చెరువుకు గండి.. గ్రామస్తుల భయాందోళన

VKB: ధారూరు మండలం గురుదోట్ల గ్రామంలో భారీ వర్షాల కారణంగా గ్రామ చెరువుకు గండి పడింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై రాఘవేందర్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.