'విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత కూటమిదే'
విశాఖ: విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి చింతా మోహన్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31 వరకు వేచి చూస్తామని, ఆ సమయానికి విశాఖ ఉక్కుపై కూటిమి స్టాండ్ తెలియజేయాలన్నారు. లేదంటే కేంద్రంతో తెగతెంపులు చేసుకోవాలని, కేంద్ర కేబినెట్ నుంచి కూటమి మంత్రులు బయటకు రావాలన్నారు.